మృతిచెందిన గొర్రెపిల్లలు
బత్తలపల్లి : తాడిమర్రి గ్రామంలోని గొర్రెల కాపరికి చెందిన గొర్రెపిల్లలు కుక్కల దాడిలో మృతిచెందాయి. గ్రామంలోని గంగప్ప 35 గొర్రె పిల్లలను గూడులో ఉంచి పెద్ద గొర్లను బయటకి తీసుకెళ్లాడు. ఆసమయంలో కుక్కలు గూడులో ఉన్న గొర్రెపిల్లలపై దాడిచేసి చంపేశాయి. దీంతో తనకు దాదాపు మూడు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. పశువైద్యాధికారి స్వర్ణలత చనిపోయిన గొర్రె పిల్లలను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదికలు పంపి ఆర్థిక సాయం వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.










