May 27,2023 16:40

మృతి చెందిన దుప్పిలు

ప్రజాశక్తి-సిద్ధవటం : కడప జిల్లా సిద్దవటం మండలంలోని ఎస్‌.రాజంపేట ఎస్‌సి కాలనీ శివారు రిజర్వ్‌ ఫారెస్ట్‌ సమీపంలోని శివారెడ్డి పొలం వద్ద కుక్కల దాడిలో తెల్లవారు జామున నాలుగు పొడదుప్పిలు మృతి చెందాయి. సిద్దవటం అటవీక్షేత్రాధికారి ప్రసాద్‌, డిప్యూటీ రేంజర్‌ ఓబులేసు, ఫారెస్ట్‌ బీటు అధికారి రాజశేఖర్‌రెడ్డి, ఎబిఒహైమావతి, అటవీ సిబ్బంది, ప్రొటెక్షన్‌ వాచర్లు తెలిపిన వివరాల మేరకు...శనివారం తెల్లవారుజామున పొడదుప్పులను కుక్కల మంద తరుముకుంటూ వచ్చి దాడి చేయడంతో ఒక ఆడ జింక దాని మూడు పిల్లలు తీవ్ర గాయాలతో మృతి చెందాయి. విషయం తెలియడంతో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన పొడదుప్పులను సిద్దవటం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. సిద్దవటం పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. సాహెబ్‌బావి బేస్‌ క్యాంపు వద్ద దుప్పులకు ఖననం చేశారు.