విద్యార్థినులకు సర్టిఫికెట్‌లు అందజేస్తున్న దృశ్యం
కస్తూరిదేవి పాఠశాలలో
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం
నెల్లూరు:నగరంలోని కస్తూరిదేవి పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష సమితి అధ్యక్షులు చలంచర్ల భాస్కర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతభాషా దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. బంగ్లాదేశ్ ప్రజలు మాతభాష కోసం పోరాడి అమరులై, ప్రపంచంలో స్ఫూర్తిని నింపారని, దాని కారణంగానే యునెస్కో అంతర్జాతీయ మాతభాషా దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు. మాతభాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యుక్తులు కావాలని ఆకాంక్షించారు. భారతప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి మాట్లాడుతూ, ప్రపంచంలో 6000కు పైగా భాషలు ఉన్నప్పటికీ, అందులో 40 శాతం భాషల్లో వాటిని మాట్లాడే ప్రజలు విద్యను అందుకోలేకపోతున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే అనేక భాషలు అంతర్దానమయ్యే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో మన భాషా, సంస్కతులను కాపాడుకోవలసిన అవసరం ఉందని, యువతరం ఈ దిశగా నడుం బిగించాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జయప్రకాష్, పాతూరి అన్నపూర్ణ లు మాట్లాడుతూ, తెలుగు భాష ఎంతో మధురమైనదని, ఇలాంటి భాషకు వారసులం అయినందకు గర్వించాలని తెలిపారు. భాషను కాపాడుకోవటం మాత్రమే కాదని, ఇంతటి గొప్ప భాషలోని సాహిత్యాన్ని యువత చదివే ప్రయత్నం చేయాలని సూచించారు.అంతర్జాతీయ మాతభాష దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అంతకు ముందు తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో కరి మద్దెల నరసింహారెడ్డి, వేదం సూర్యప్రకాష్, రూడ్స్ సంస్థ చైర్మన్ రసూల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ, నజ్మా, అరుణ, భారతి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.










