పార్టీలోకి చేరిన వారితో పరిటాల శ్రీరామ్
ధర్మవరం టౌన్ : తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికే ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సిద్దయ్యగుట్టకు చెందిన వైసీపీ కార్యకర్తలు బాబావలి, బాషా, ఖలీల్, మహబూబ్ బాషా, రియాజ్, సాయి, అమీన్ తదితరులు టిడిపిలో చేరారు. వీరికి పరిటాలశ్రీరామ్ పార్టీ కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. అనంతరం పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీనాయకులు ఫణికుమార్, పురుషోత్తం గౌడ్, కొత్తపేట ఆది, బీరే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.










