ఎపిజిబి జిఎం అనంత పద్మనాభరావు
ప్రజాశక్తి-రామాపురం : బ్యాంకులకు కస్టమర్లే మూలనిధి అని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ అనంత పద్మనాధరావు అన్నారు. స్థానిక ఎపిజిబి బ్యాంకు రూ.100 కోట్లు బిజినెస్ చేసిన సందర్భంగా కస్టమర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1985లో స్థాపించిన బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ రూ.100 కోట్ల వ్యాపారం చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి 5 జిల్లాల్లో మాత్రమే ఏర్పడి గ్రామీణ అభివృద్ధి రైతులే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కెనరా బ్యాంక్ సౌజన్యంతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్గా అవతరించి అన్ని బ్యాంకులకు దీటుగా నాబార్డ్ చేత 43 ఆర్‌ఆర్బీ బ్రాంచ్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మొదటి స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ అనంతపద్మనాభరావు అన్నారు ప్రజల చేతనే డిపాజిట్లు చేయిస్తూ తక్కువ వడ్డీ తో ప్రజలకే రుణాలు ఇస్తూ దినదినాభివ ద్ధి చెందుతున్న బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని ప్రజలకు ఎన్నో విధాలుగా రుణ సదుపాయాలు కల్పిస్తున్నదని వాహన రుణాలు ఇంటి రుణాలు వ్యక్తిగత రుణాలు వ్యవసాయ రుణాలు బంగారు రుణాలు తదితర ఎన్నో రుణాలను ఇస్తున్నదని వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఆర్థిక మాంద్యం వల్ల డిపాజిట్ల కొరత ఉండడం వాస్తవమేని కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు సేకరించి ప్రజలకు రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళ తన వ్యక్తిగతంగా మనిషికి రూ.పదివేలు చొప్పున డిపాజిట్లు చేసి అధిక వడ్డీని పొందవచ్చని తెలిపారు. డిపాజిట్‌లలో అధిక వడ్డీ వచ్చే ప్రగతి సిరి 666 రోజులు వీటికి 7.80 శాతం వడ్డీ ప్రగతి సిరి 400 రోజులు 7.4 0 వడ్డీ మంచి పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎపిజిబి రీజినల్ మేనేజర్ రమణ మాట్లాడుతూ అన్ని బ్యాంకులు కన్నా రామాపురం బ్రాంచ్‌లో ప్రజలు రైతులు కస్టమర్లు సహకారంతో రూ.100 కోట్లు వ్యాపార లావాదేవీలు సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. బ్యాంకు మేనేజర్ మంజుల మాట్లాడుతూ ఖాతాదారుల్లో మెరుగైన సేవలు అందించడమే తన ధ్యేయమని ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా బ్యాంకు సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ జ్యోతి, ప్రకాష్, బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు, డ్వాక్రా మహిళలు, ఆనిమేటర్లు పాల్గొన్నారు.










