భోపాల్ : దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై మధ్యప్రదేశ్‌లో బిజెపి మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలపై విలేకరుల ప్రశ్నకు మంత్రి ఓం ప్రకాశ్ సక్లేచ స్పందిస్తూ, 'కష్టాలు మీకు ఆనందం అంటే ఏమిటో గుర్తించేలా చేస్తాయి. కష్టాలు లేకపోతే ఆనందాన్ని పొందలేరు' అని చెప్పారు. పెట్రోల్ ధరలను నియంత్రించడంలో మోడీ విఫలమయ్యారని మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో పోలియో వ్యాక్సిన్ వేయడానికి కాంగ్రెస్ పార్టీకి 40 ఏళ్లు పట్టిందని, కరోనా వ్యాక్సిన్‌ను మోడీ ఒక ఏడాదిలోనే తీసుకొచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు.










