Jan 09,2023 21:25

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

         పుట్టపర్తి అర్బన్‌ : వారంలో మూడు రోజులు ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతి సాధించాలిని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం నుంచి 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, హౌసింగ్‌, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ, హౌసింగ్‌, గడపగడపకు మన ప్రభుత్వం, స్పందన తదితర అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌, ఇతర అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖతో కలిసి వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హౌసింగ్‌కి సంబంధించి ఉగాది నాటికి 10,750 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఇందులో భాగంగా జనవరి నెలకు కేటాయించిన లక్ష్యాన్ని ముందుగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీకి సంబంధించి లక్ష్యం మేరకు కూలీలు ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఎంపిఎఫ్‌సి గోడౌన్‌లకు సంబంధించి జిల్లాలో మూడో దశలో మంజూరైన గోడౌన్‌లకు వచ్చే గురువారం నాటికి పెండింగ్‌ ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని తహశీల్దార్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందన గ్రీవెన్స్‌ పరిష్కారంపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, డిసిఒ కష్ణానాయక్‌, సర్వే ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రామకష్ణ, చేనేత జౌళి శాఖ ఎడి రమేష్‌, ఇన్‌ఛార్జి డిఇఒ మీనాక్షి, ఆరోగ్యశ్రీ అధికారి యల్లప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.