Jul 14,2021 13:52

అమరావతి : తెలంగాణతో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఎపి ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషన్‌ను దాఖలు చేసింది. చట్టబద్ధమైన నీటి వాటాను తెలంగాణ రానీయడం లేదని పిటిషన్‌లో ఎపి సర్కార్‌ ఆరోపించింది. పిటిషన్‌లో... ''శ్రీశైలంలో తక్కువ నీరున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేసింది. వారి తీరుతో ఎపి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్ధం. ఆ రాష్ట్ర వైఖరి మా ప్రజల జీవించే హక్కును హరించేలా ఉంది. విభజన చట్టంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలు అమలు చేయడం లేదు. కెఆర్‌ఎంబి, కేంద్రం ఆదేశాలను తెలంగాణ అమలు చేయడం లేదు '' అని ఎపి ప్రభుత్వర ఉన్నత న్యాయస్థానానికి వివరించింది.