Mar 10,2023 22:01

కర్నాటక గవర్నర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న తేజస్‌

హిందూపురం : హిందూపురం పట్టణం సడ్లపల్లికి చెందిన ఎస్‌. తేజస్‌ కర్నాటక రాష్ట్రంలో డిగ్రీలోనే కాకుండా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ లోను విశ్వవిద్యాలయ పరిధిలో ప్రథమ స్థానం సాధించి విజయకేతనం ఎగురవేశాడు. శుక్రవారం విశ్వం విద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నాడు. సడ్లపల్లికి చెందిన తేజస్‌ బెంగళూరు విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి, గ్రామీణ అభివృద్ది విశ్వవిద్యాలయం తరపున ప్రజా ఆరోగ్య విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, ప్రథమ ర్యాంకు సాధించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు తేజస్‌ను అభినందించారు.