సోమందేపల్లి : మండల పరిధిలోని 44 వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం తరలిస్తున్న రెండు వాహనాలను శుక్రవారం పట్టుకున్నట్లు పెనుకొండ సిఐ కరుణాకర్, స్థానిక ఎస్‌ఐ విజరు కుమార్ తెలిపారు. కదిరి ప్రాంతానికి చెందిన పవన్ కుమార్, సల్మా ,శంకరప్ప అనే వ్యక్తులు బాగేపల్లి తాలూకాకు చెందిన చేలూరు గ్రామ బ్రాందీ షాప్ నుండి సుమారు10,560 మద్యం ప్యాకెట్లను టాటా ఇండికా, బులెరా వాహనాల ద్వారా తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బులెరా వాహన డ్రైవర్ అర్జున్ తప్పించుకున్నాడని మిగిలిన వారిని అరెస్టు చేశామని వీరిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ మురళి, హెడ్ కానిస్టేబుళ్లు ఆదినారాయణ, సుధాకర్, పోలీసులు రంగనాయకులు, జగన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : మండల పరిధిలోని వీరాపురం గ్రామ పంచాయతీ హుస్సేన్ పురం గ్రామంలో శుక్రవారం ఓ ఇంటి లో అక్రమంగా కర్నాటక మద్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 42 కర్నాటక మద్యం పాకెట్లను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.










