కర్ణాటక ఎన్నికలు బిజెపికి చెంపపెట్టు
ప్రజాశక్తి-సీతారామపురం : కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై మండల కాంగ్రెస్ నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కానాల హాజరత్తయ్య ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి వ్యతిరేక విధానాలకు ప్రజలు విసుగు చెందారని దేశంలో మార్పును ప్రజలు కోరుతున్నారని దాని తొలి అడుగు ప్రయత్నమే కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. ఇదే తరహాలో రాబోయే 2024 ఎన్నికలలో యుపిఎ కూటమి అధికారంలోకి వస్తుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగుతుందని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కానాల ఖాజావలి, అమీర్ బాబు మోష, అమీల పోగు బాలయ్య, అమీల పోగు యోబు, కె ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.










