Apr 08,2023 21:25

ఫొటో : విజేతలకు బహుమతులందజేస్తున్న ఎం.ఎల్‌.ఎ. రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి

క్రికెట్‌ విజేతలకు బహుమతులు
ప్రజాశక్తి-కావలి : కావలి జెడ్‌పి గ్రౌండ్‌లో నెల్లూరు జిల్లా లెదర్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా శనివారం ముఖ్య అతిథిగా కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. సరదాగా కాసేపు మ్యాచ్‌ ఆడారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడార రంగంలో కూడా యువత పార్టిసిపేట్‌ చేసి,
కావలి నియోజకవర్గానికి మంచిపేరు తీసుకురావాలని క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కావలి రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈతముక్కల బాల మురళి రెడ్డి, నాయకులు ప్రసాద్‌ రెడ్డి, కుందుర్తి కామయ్య, 11వ వార్డు ఇన్‌ఛార్జి ఆత్మకూరు రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.