చిన్నమండెం : మండల పరిధిలోని కస్బాలో మంగళవారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో గెలుపొందిన టీమ్‌లకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటిబహు మతిగా చిన్నమండెం కస్పా విన్నర్స్ 25000 రూపాయలు, 2వ బహుమతి చిన్న మండెం బలిజపల్లికి చెందిన రన్నర్ టీమ్‌కు 12,500, రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షేక్ షమీర్, మ్యాన్ ఆఫ్‌ది సీరీస్ నిరంజన్‌లకు మాజీ టిటిడి పాలక మండలి సభ్యులు, స్పాన్సర్ సుగవాసి ప్రసాద్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆడిన ప్రతిఒక్క వ్యక్తి సోదర భావంతో మెలగాలని, కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు తౌహీద్ ఖాన్, షాబుద్దీన్, తాజుద్దీన్, సైఫుల్లాఖాన్, వాజీద్‌ఖాన్, తంజీర్, నాజీర్, షాదిక్, ఫారుక్, ముజావుద్దీన్, జబీబుల్లా, అఫ్జల్, బర్కత్, నాజీమ్, సాదిక్, ఫయాజ్, జిల్లా టిడిపి మైనారిటీ నాయకుడు మయానా ఇర్శాద్‌ఖాన్, మన్నేరు రామాంజనేయులు, బడిశెట్టిరవి, ముని క్రీడాకారులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










