Jan 13,2023 21:58

విద్యార్థులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి- నంబులపూలకుంట : మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించిన పూల మండలస్థాయి క్రికెట్‌ టోర్నీని సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బత్తల వెంకట రమణ, కదిరి పట్టణ అధ్యక్షులు బహుద్దీన్‌, బాబాఫకృద్దీన్‌, శివారెడ్డి, సంతోష్‌, సతీష్‌, శరత్‌, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.