క్రీడలతో మానసికోల్లాసం
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : క్రీడలు శారీరక, మానసిక ఉత్సాహంగా పొందుతారని యువత క్రీడల్లో రాణించాని పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పల్లిపాడు గ్రామంలో నందమూరి బసవరామ తారకం మెమోరియల్ ఫౌండర్ జాన గిరిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి రూ.50వేల నగదును ఎన్‌ఎస్‌ఆర్‌సిసికు గెలుపొందగా, రెండవ బహుమతి రూ.25వేల నగదును, బిహెచ్‌ఎస్ ఎక్స్పర్ట్స్ కైవసం చేసుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్‌టి రామారావుపై అభిమానంతో గత 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న జానా గిరిబాబును అభినందించారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రావెళ్ల వీరేంద్ర చౌదరి, చెంచుకిషోర్ బాబు, చెముకుల కృష్ణచైతన్య, బసవతారకం మెమోరియల్ కమిటీ మెంబర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.










