Feb 02,2023 18:40

క్రీడాకారులను అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

ప్రజాశక్తి -కందుకూరు :రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ 21వ క్యాటగిరి మహిళా విభాగంలో జనవరి 21న విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కందుకూరులోని వివేక డిగ్రీ కాలేజీ విద్యార్థులు నెల్లూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి మహిళల కేటగిరీలో రాష్ట్రస్థాయిలో తతీయ స్థానం సాధించారు. ఆక్సఫర్డ్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఉన్నం భాస్కరరావు పి మానస, టి మానస, క్రీడాకారులను అభినందించారు. కళాశాలలో విద్యుత్‌తో పాటు క్రీడలకు ప్రాతినిధ్యం ఇస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడలలో జాతీయ స్థాయిలలో విద్యార్థులు రాణించాలని కోరారు. క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వస తులను కల్పించడానికి కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆక్సఫర్డ్‌ విద్యా సంస్థల కరస్పాండెంట్‌ బండి వెంకటేశ్వర్లు ,డైరెక్టర్స్‌ బాల భాస్కరరావు, బెజవాడ నరేంద్ర బాబు, కళాశాల ప్రిన్సిపల్‌ అబ్బూరి వెంకటేశ్వర్లు ఉన్నారు.