ప్రొద్దుటూరు: ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు సేవ చేస్తూనే మరొకపక్క జాతీయ స్థాయిలో బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా రాణిస్తూ విశాఖ పేరు ప్రఖ్యతలను దేశ వ్యాప్తంగా నిలబెడుతున్న్నారు మహా విశాఖ నగర పాలక సంస్థలో 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ. ఆమె జివిఎంసి కార్పొరేటర్‌గా వార్డులో సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తూనే మరొకపక్క తన ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించి సాధన చేస్తూ జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్-2023లో 45 ఏళ్ల క్యాటగిరిలో సింగిల్స్, మిక్స్ డబుల్ గెల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి స్త్రీ, పురుషుల విభాగాలలో జరిగిన ఈ పోటీల్లో మహిళల సింగిల్స్ విభాగంలోనూ, మిక్సిడ్ డబల్ విభాగంలోనూ ఆమె ప్రథమ స్థానంలో గెలిచారు. ఈ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ గెలుచుకున్న అనంతరం వచ్చే నెలలో గోవాలో జరగబోయే నేషనల్ ఛాంపియన్షిప్‌కు ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వహించనున్నారు.










