May 19,2023 22:00

ధర్మవరంలో క్రీడాకారులు, నాయకులతో పరిటాల శ్రీరామ్‌

ప్రజాశక్తి బత్తలపల్లి : క్రీడల పట్ల యువతను ప్రోత్సహించడానికే రాప్తాడు- ధర్మవరం సూపర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు టిడిపి అధికార ప్రతినిధి, ధర్మవరం టిడిపి ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. మండల కేంద్రమైన బత్తలపల్లిలో పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాప్తాడు- ధర్మవరం సూపర్‌ లీగ్‌ ( ఆర్‌డిఎస్‌ఎల్‌ ) మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను పరిటాల శ్రీరామ్‌ తో పాటు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజరు కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించారు. మొదటగా పరిటాల శ్రీరామ్‌ బ్యాటింగ్‌ చేయగా గోనుగుంట్ల విజరు కుమార్‌ బౌలింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ టోర్నమెంట్‌ కు సుమారు 30 జట్లు ఎంట్రీ ఫీజు చెల్లించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ గోనుగుంట్ల నారాయణరెడ్డి, మండల క్లస్టర్‌ ఇన్‌ఛార్జి సురేంద్రనాయుడు, ధర్మవరం నియోజకవర్గం ఆర్‌టిఎస్‌ కోఆర్డినేటర్‌ బోయపాటి అప్పస్వామి నాయుడు, గంటాపురం జగ్గు తదితరులు పాల్గొన్నారు.
రామగిరి : పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నీని శుక్రవారం ప్రారంభించినట్లు రామగిరి మండల టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ ఎల్‌ శ్రీధర్‌ నాయుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బడమద్దుల రంగయ్య, రామ్మూర్తి నాయుడు, పరంధామ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గుర్రం శీన, పేపర్‌ శీన తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రాప్తాడు, ధర్మవరం క్రికెట్‌ సూపర్‌ లీగ్‌ టోర్నీని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ శుక్రవారం ప్రారంభించారు.. ముందుగా పరిటాలరవీంద్ర చిత్రపటానికి హలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టోర్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దఢత్వాన్ని ఇస్తాయన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. క్రీడాకారులకు అవసరమైన తాగునీరు మజ్జిగ,అల్పాహారం పామియానాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు గోనుగుంట్ల విజయకుమార్‌, కమతంకాటమయ్య, నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్చార్జ్‌ చింతలపల్లి మహేశ్‌ చౌదరి, నాయకులు ఫణికుమార్‌, పురుషోత్తంగౌడ్‌, రాంపురంశీన, గంగారపురవి, కేశగాళ్ల శ్రీనివాసులు, నాగూర్‌ హుస్సేన్‌, రాళ్లపల్లిషరీఫ్‌, ఓంప్రకాశ్‌, చిన్నూరు విజరు చౌదరి, తోటవాసుదేవ తదితరులు పాల్గొన్నారు.