Dec 04,2022 22:05

క్రీడాకారులతో నాయకులు

కదిరి టౌన్‌ : కదిరి రూరల్‌ మండల పరిధిలోని ఎరుకులవాండ్ల పల్లి సమీపంలో ఉన్న హరీష్‌ పాఠశాలలో గత పది రోజులుగా శిక్షణ పొందుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 15 మంది హ్యాండ్‌ బాల్‌ క్రీడాకారులకు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పరికి నజీమున్నీసా సాదిక్‌ ఆదివారం క్రీడా సామాగ్రి, ట్రాక్‌ సూట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఈనెల 5,6వ తేదీల్లో 37వ ఏపీ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలు జరుగుతాయని, ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమవంతుగా ఈ ట్రాక్‌ సూట్లను అందజేశామని తెలిపారు. క్రీడాకారులకు పది రోజులపాటు తమ పాఠశాలలో భోజనం, వసతి సదుపాయం కల్పించి అన్ని విధాన సహకరిస్తున్న స్కూల్‌ నిర్వాహకులు కిరణ్‌ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌ బాల్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బలరాం రెడ్డి, కమల్‌బాషా, వైసీపీ నాయకులు కుర్లి శివారెడ్డి. షాను ఇబ్రహీం, షేక్‌ ఇబ్రహీం, వ్యాయమ ఉపాధ్యాయులు ఖాదర్‌ వలీ, ప్రసన్న కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.