May 22,2023 21:53

ఫొటో : ప్రోత్సాహకం అందజేస్తున్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు

క్రీడాకారులకు రూ.10వేలు ప్రోత్సాహకం
ప్రజాశక్తి-కావలి : బాస్కెట్‌బాల్‌ క్రీడాపోటీల్లో రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించిన క్రీడాకారులకు జనతాపేటలోని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు స్వగృహంలో రూ.10వేలు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వెస్ట్‌ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన 6వ యూత్‌ బాస్కెట్‌ బాల్‌ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కావలిలో బాస్కెట్‌ బాల్‌ శిక్షకులు పి.జోసెఫ్‌ సుకుమార్‌, పర్యవేక్షణలో, కావలి నుండి, క్రీడా కారులు పాల్గొని, రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు.
క్రీడలలో, మన కావలి విద్యార్థులు, బాస్కెట్‌బాల్‌, పోటీలలో పాల్గొని, ప్రతిభ కనుపరిచి, రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు, క్రీడలలో, మరియు, అన్ని రంగాల్లో, బాగా రాణించి, ఉపాధ్యాయులకు, శిక్షకులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆశీస్సులు తెలియజేస్తున్నానని తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా రూ.10వేలు అందించామన్నారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నగళ్ల శ్రీనివాస్‌ కిరణ్‌ పాల్గొన్నారు.