Mar 11,2023 20:19

క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : నియోజకవర్గంలోని క్రీడాకారులకు ఎల్లవేళలా తోడుంటామని వైఎస్‌ఆర్‌సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎంఎల్‌ఎ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని ఈద్గా మైదానంలో అబూసిద్దిక్‌ ట్రావెల్స్‌ స్పాన్సర్‌ షిప్‌తో, వైఎస్‌ఆర్‌ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. తొలుత ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టాస్‌ వేసి ఫైనల్‌ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు ఆయన బ్యాటింగ్‌ చేసి క్రీడాకారులును ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 రోజుల పాటు 40 మ్యాచ్‌లను ఉత్సాహంగా నిర్వహించి ఫైనల్స్‌కు చేరుకోవడం హర్షనీయమన్నారు. టి -20 మ్యాచ్‌లు రాయచోటిలో నిర్వహించాలని ఆయన ఆకాక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చెప్పారు. యువత ఆవేశాలుకు ఎప్పుడూ లోనూ కాకూడదని, క్రమశిక్షణ, మంచి గుణాన్ని పెంపొందించు కోవాలన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా రాయచోటి నియోజక వర్గంలో అభివద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష మాట్లాడుతూ ఎంఎల్‌ఏ శ్రీకాంత్‌ రెడ్డి సారధ్యంలో త్వరలో సుమారు ఇరవై ఎకరాలలో రూ.50 కోట్ల నిధులతో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు కానుందన్నారు. వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ నియోజక వర్గాన్ని ఎంఎల్‌ఏ అన్ని రంగాలలో అభివద్ధి పథంలో తీసుకు వెళ్తున్నారన్నారు. వైఎస్‌ఆర్‌ సిపి జిల్లా మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ క్రీడలకు జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈద్గా అభివద్ధిలో ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎంఎల్‌ఏ శ్రీకాంత్‌రెడ్డి కషి గొప్పదన్నారు. విజేతలకు రూ. 50 వేలు, రన్నర్స్‌కు రూ.30 వేలు బహుమతిని అబూ సిద్దిక్‌ ట్రావెల్స్‌ వారు అందిస్తున్నారని చెప్పారు. రూ 50 వేలు బహుమతిని తాను, రన్నర్స్‌ కు రూ 30 వేలు బహుమతిని అబూ సిద్దిక్‌ ట్రావెల్స్‌ వారు అందాచేస్తు న్నారన్నారు.
ఈద్గా ప్రాంగణంలో పనుల పరిశీలన :రాయచోటి పట్టణంలోని ఈద్గాలో వజు ఖానా నిర్మాణం పనులను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన, నాణ్యతగా నిర్మాణ పనులను రంజాన్‌లోగా పూర్తయ్యేలా చూడాలని ఈద్గా వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడైన బేపారి మహమ్మద్‌ ఖాన్‌ కు ఎంఎల్‌ఎ సూచించారు. కార్యక్రమాలలో ఆసీఫ్‌ అలీఖాన్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, సుగవాసి శ్యామ్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, పల్లా రమేష్‌, జానం రవీంద్ర యాదవ్‌, అన్నసలీం, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, రియాజుర్‌ రెహమాన్‌, వెంకటేసుపాల్గొన్నారు.