Jan 17,2023 21:15

బహుమతులు అందజేస్తున్న శివుని నరసింహులరెడ్డి

బహుమతులు అందజేస్తున్న శివుని నరసింహులరెడ్డి
క్రీడాకారుడికి క్రమశిక్షణ తప్పనిసరి
కోవూరు:ప్రాథమిక దశ నుంచి ప్రతి క్రీడాకారునికీ క్రమశిక్షణ తప్పనిసరి అని మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు శివుని నరసింహులు రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా పెద్ది ప్రభావతి మెమోరియల్‌ ఆధ్వర్యంలో కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల స్థాయిలో నిర్వహించిన షటిల్‌ పోటీ విజేతలకు మంగళవారం బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారుడు గెలుపు ఓటమి లను సమానంగా తీసుకోవాలన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసేందుకు క్రీడా సంబరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థికీ కేవలం చదువే కాకుండా క్రీడల పట్ల చొరవ చూపాలన్నారు. దీనివలన వారి మేధస్సు మరింత పదును పడుతుందన్నారు.రానున్న సంవత్సరం ఈ పోటీలను జిల్లాస్థాయిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను కోరారు.
అందుకు అవసరమైన సహాయ సౌకర్యాలు తమ వంతుగా అందించేలా ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ నిర్వాహకులు పెద్ది మారుతి నాగార్జున పలు విషయాలను తెలియజేశారు. కార్యక్రమంలో అవినాష్‌ రెడ్డి. నవీన్‌ రెడ్డి. శ్రీనివాసులు. నిరంజన్‌, దయాకర్‌, పవన్‌ సాయి, పవన్‌, సుమధుర్‌ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
కోవూరు లోని మండల పరిషత్‌ క్రీడా ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహించిన షటిల్‌ పోటీలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ప్రథమ స్థానాన్ని. జోసఫ్‌ నూతనలు కైవసం చేసుకున్నారు. వీరికి రూ.10,116లు, మెమెంటోలు. మెడల్స్‌ ను మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు శివుని నరసింహులు రెడ్డి పంపిణీ చేశారు. రెండో బహుమతి నాని అండ్‌ శ్రీకాంత్‌, మూడో బహుమతి అవినాష్‌ అండ్‌ మస్తాన్‌ కైవసం చేసుకున్నారు.