ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : క్రీడలను సంతోషంగా ఆస్వాదించి ఆడాలని, క్రీడా స్ఫూర్తిని చాటాలని టిడిపి సీనియర్ నాయకులు చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుక్నుఆ్నరు. అనంతరం టాస్ వేసి క్రీడాకారులతో కలసి కొద్దిసేపు బ్యాటింగ్ చేసి, క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా సానుకూల దృక్పథం ఏర్పడుతుందని, గెలుపోటములు స్వీకరించే గుణం అలవడుతుందని పేర్కొన్నారు. యువత క్రీడల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రాము యాదవ్, ప్రధాన కార్యదర్శి సుహేల్, యువ నాయకులు ఊటుకూరు సతీష్ రాజు, మృగరాజు, విజరు నాయుడు, ముస్లిం మైనారిటీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మండెం కరీముల్లా, ఒంటిమిట్ట వినోద్ రెడ్డి, శేషారెడ్డి, సూర్యనారాయణ రాజు, గణపతి, సురేష్, నాగేంద్ర తులసి, కంటా శివ, రాజేష్ వర్మ, శేఖర్, యాసీన్ శివ, రవీంద్ర, అభిరామ్, క్రికెట్ ఆర్గనైజర్లు రాఘవ, శివ, కిరణ్ పాల్గొన్నారు.










