Jan 13,2023 22:13

ఫొటో : జక్కా వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

క్రీడా ప్రారగణం ప్రారంభం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సిపిఎం సీనియర్‌ నేత, మాజీ ఎంఎల్‌ఎ జక్కా వెంకయ్య క్రీడా ప్రాంగణాన్ని శుక్రవారం సిపిఎం పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్‌రాజు రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం డివైఎఫ్‌ఐ జెండాను డివైఎఫ్‌ఐ మాజీ సీనియర్‌ నాయకులు పి.జిలాని జెండా ఎగురవేశారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సంధాని జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. క్రీడాకారులను ఉద్దేశించి డేవిడ్‌ రాజు, సంధానిలు మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలని పిలుపునిచ్చారు. యువత డివైఎఫ్‌ఐ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ని
రుద్యోగ సమస్య పోవాలంటే - పోరాటమే మార్గమన్నారు. అనంతరం క్రీడలలో భాగంగా క్రికెట్‌ మైదానాన్ని యుటిఎఫ్‌ నాయకులు కె.సురేష్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్ర ఉద్యమ ఉపాధ్యాయులు ఎమ్‌డి సాదిక్‌ హుస్సేన్‌ బ్యాటింగ్‌ చేయగా సిఐటియు నాయకులు ఎ.మహేష్‌ బౌలింగ్‌ చేసి కాటన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు నందా శ్రీను, జీవన్‌, రాబర్ట్‌, రాకేష్‌, పి శ్రీనివాసులు, హరిబాబు, సుల్తాన్‌ అభిరాం, ప్రజానాట్యమండలి నాయకులు గద్దర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.