Feb 08,2023 22:17

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌

కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ ఫొటో ముద్రించాలి
ప్రజాశక్తి బిట్రగుంట : కరెన్సీ నోట్లపై డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఫొటో ముద్రించేలా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ప్రారంభమైన గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజాపోరు యాత్ర బుధవారం బోగోలు మండల కేంద్రం అంబేద్కర్‌ విగ్రహం దగ్గర చేరుకుంది. మండల కేంద్రంలో పాలు కూడళ్లలో రథయాత్ర ర్యాలీ నిర్వహించి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం పరశురామ్‌ మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రూపాయి విలువ పడిపోయిందని, ఆర్థిక సంక్షోభం వచ్చి బ్యాంకులన్నీ దివాలా తీశాయి.
ఈ నష్టాన్ని పూరించడానికి బ్రిటీష్‌ ప్రభుత్వం 1921లో ఇంపిరియల్‌ బ్యాంకు ఏర్పాటు చేసిందని, కానీ విధులు నిర్వహించడంలోనే విఫలమైందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ డిమాండ్‌ సాధన కోసం పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధయాత్ర ఢిల్లీలో మహాధర్నా నిర్వహించడం వల్ల ఇప్పటికీ 8 మంది ఎంపిలు పార్లమెంట్లో మాట్లాడినట్లు తెలిపారు. మిగతా ఎంపిలు మాట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని లక్ష్యంతో ఇప్పుడు ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నమన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సంపూర్ణ మద్దతునిచ్చి ఈ లక్ష్యసాధనలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌, జైభీమ్‌ సేవాదళం అధ్యక్షులు బత్తుల రవిచంద్ర, బత్తుల కృష్ణారావు, మాజీ బిడబ్ల్యూఎ అధ్యక్షుడు కుందుర్తి శ్రీనివాసులు, బత్తుల మల్లికార్జున, ఎస్‌కె నూరుద్దీన్‌, లేళ్లపల్లి వేణు, తదితరులు పాల్గొన్నారు.