Feb 12,2023 21:04

ఎఆర్‌.సురేష్‌ ను సన్మానిస్తున్న సినీ నటుడు సుమన్‌, అనంతన్‌

మదనపల్లె అర్బన్‌ : కరాటేలో నిర్విరామ సేవలందించిన పట్టణానికి చెందిన డాక్టర్‌ ఏ.ఆర్‌.సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆదివారం విశాఖపట్టణంలోని స్వర్ణ భారతి ఇండోర్‌ స్టేడియంలో అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌ నిర్వాహకులు ఎస్‌పిఎండి.నాయుడు మాట్లాడుతూ సురేష్‌ కరాటేనే ఇంటిపేరుగా పెట్టుకుని షీటీమ్‌, సచివాలయ పోలీసులకు, ఉమెన్‌ పోలీసులకు, ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాల విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తన సంస్థ యూత్‌ కరాటే అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ప్రముఖులచే ఆయనకు సన్మానం చేసినట్లు తెలిపారు. అనంతరం సురేష్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నో సన్మానాలు అందుకున్నానని, మహాగురు సోక్‌ సార్‌ కె.అనంతన్‌ మలేషియా, సినీ నటుడు సుమన్‌ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం మరచిపోలేని మధురమైన అనుభూతిగా ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, నేపాల్‌, శ్రీలంక, స్విజర్‌ ల్యాండ్‌, మలేషియా, దుబారు వంటి దేశాల నుండి కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.