Feb 02,2023 21:51

ప్రశంసాపత్రాలతో విద్యార్థులు

కదిరి అర్బన్‌ : స్థానిక ఐక్యూఆర్‌ఎ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో కియో జపాన్‌ షోటోకాన్‌ కరాటే అసోసియేషన్‌ ఇండియా కరాటే బెల్ట్‌ ఎగ్జామినేషన్‌ మాస్టర్‌ అక్బర్‌ అలీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కరాటే విన్యాసాలు అబ్బురపరిచాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐక్యూఆర్‌ఎ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ కరస్పాండెంట్‌ నాసిర్‌ పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన పంచెస్‌ కిక్స్‌, కథాస్‌, టైల్స్‌ బ్రేకింగ్‌, గర్ల్స్‌ హెడ్‌ తో టైల్స్‌ బ్రేకింగ్‌ చేయడం లాంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈసందర్భంగా 8 మంది కి ఎల్లో బెల్ట్‌, ఏడుగురికి ఆరెంజ్‌ బెల్ట్స్‌, ఒకరికి గ్రీన్‌ బెల్ట్‌, ఒకరికి బ్లూ బెల్ట్‌ అందజేసి ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే ఇన్‌స్ట్రక్టర్లు మహమ్మద్‌ రఫీ, రియాజ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.