Mar 07,2023 21:46

ప్రశంసాపత్రాలతో విద్యార్థులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కదిరి హరీష్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు మాస్టర్‌ అక్బర్‌ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పీలేరు శ్రీనివాస ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో వైట్‌ బెల్ట్‌ కటాస్‌ విభాగంలో జస్వంత్‌, కుషల్‌, అభిషేక్‌, జ్యోతి గోల్డ్‌ మెడల్‌ సాధించినట్లు చెప్పారు. అలాగే వినరు, వేమంత్‌, శివశంకర్‌, లవన్‌, సమీర్‌, గణేష్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించారన్నారు. శాలిని, వంశీ, భవదీప్‌ బ్రాంచ్‌ మెడల్‌ సాధించారని తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరస్పాండెంట్‌ కిరణ్‌ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని, మెడల్‌ను అందజేశారు. ఈసందర్భంగా హరీష్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కిరణ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల్లో ముందుండాలని సూచించారు. ముఖ్యంగా కరాటే కరాటే వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని పిల్లల్లో కాన్ఫిడెంట్‌ లెవెల్‌ని పెరుగుతుందని చెప్పారు. శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్‌ అక్బర్‌ అలీని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే ఇన్స్‌పెక్టర్‌ వసుంధర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.