కడప ప్రతినిధి : ఎట్టకేలకు జిల్లా పారిశ్రామికాభివృద్ధి ఊపందుకోనుంది. ఆసియాలోనే గుర్తింపు పొందిన కొప్పర్తి పారిశ్రామికవాడలో మౌలిక వసతుల కల్పనకు వడివడిగా అడుగులు పడు తున్నాయి. మూడేళ్లుగా కొప్పర్తి పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటు కు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మౌలిక వసతుల లేమి పరిస్థితుల కారణంగా ఊగిస లాడుతున్న పరిస్థితి దాప ురించింది. ప్రభుత్వం కొప్పర్తి పారిశ్రామికవాడలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. పరిశ్రమల ఏర్పాటులో కీలక మైన భూముల అభివృద్ధి, నీటి వనరులు, పర్యా వరణ అనుమతుల లభ్యతే లక్ష్యంగా ముం దుకు సాగుతోంది. ఈ నెల 23, 24వ తేదీల్లో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో భాంగా కమలాపురం, పులివె ందులలో రూ.665 కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థా పనలు చేయనున్నారు. ఆదిశగా జిల్లా అధికార యం త్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. కొప్పర్తి పారిశ్రామికవాడ కేంద్రంగా రూ.222 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో రూ.150 కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి మైదుకూరు మీదుగా ఆర్టీపీపీకి వెళ్తున్న పైప్‌లైన్ నుంచి 0.6 టిఎంసిల సరఫరా సామర్థ్యం కలిగిన పైప్‌లైన్, రూ.34 కోట్లతో ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, రూ.38 కోట్లతో స్టోరేజీ ట్యాంక్, రూ.54 కోట్లతో కార్గోగతిశక్తి టెర్మి నల్ ఏర్పాటు పనులకు శంకుస్థాపనలు చేయనన్నారు. రూ.8 కోట్లతో కమలాపురం మున్సిపాలిటీలో స్ట్రాంగ్‌వాటర్ డ్రెయినేజీ, రూ.58 కోట్లతో కాంప్రహెన్సివ్ వాటర్ సప్లరు పనులు, రూ.8 కోట్లతో కమ లాపురం-పాయసంపల్లి మధ్య ప్రత్యేక మరమ్మతులు, రూ.మూడు కోట్లతో ఖాజీపేట -కమలాపురం మధ్య రహదారి పనులు, రూ.39 కోట్లతో రైల్వే ఓవర్‌బ్రిడ్జి, రూ.82 కోట్లతో కడప- తాడిపత్రి జాతీయ రహదారిలోని పాపాఘ్నినదిపై బ్రిడ్జి పనులు, రూ.212 కోట్లతో జిఎన్ ఎస్‌ఎస్ ఫేజ్-1లోని ప్యాకేజీ పనులు, పులివెందులలో నిర్మించిన నూతన బస్టాండ్ పనులతో పలు అభివృద్ధి కార్యక్రవ ూలను ప్రారంభిం చనున్నారు. జగన్ జిల్లా పర్యటనలో భాగమైన అభివృద్ధి పనుల్లో జిఎన్ ఎస్‌ఎస్ ప్యాకేజీ పనుల స్థాయిలో కొప్పర్తి పారిశ్రామికవాడలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధా న్యత ఇవ్వడం గమనార్హం. కొప్పర్తిలో పైన పేర్కొన్న మౌలిక వసతుల కల్పన పనుల్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తే మరిన్ని కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.










