Jan 09,2023 20:45

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలి
నెల్లూరు:కోవూరు నియోజకవర్గానికి కూత వేటు దూరంలోని కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతు స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ కె.వి.ఎన్‌ చక్రధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ కలుజుపై బ్రిడ్జి నిర్మించాలని మూడు గ్రామాలకు చెందిన ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా రిలే దీక్షలు చేపట్టినప్పకీ అధికార యంత్రాంగం స్పందించలేదన్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల వల్ల చెరువు కలుజుపై నీరు ఉదృతంగా పారడంతో ఈ మూడు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయన్నారు. ఈ కలుజు నీటి ఉదృతికి సచివాలయ ఉద్యోగి ఒకరు వరదనీటిలో కొట్టుకుపోయి ప్రాణాలను కోల్పోయారన్నారు
. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందిని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించి కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గండవరపు శేషయ్య, ఎన్‌. దినేష్‌యాదవ్‌, బట్టా పెద్దబ్బయ్య, జి.విజయకుమార్‌, జి.సురేష్‌, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.