Jul 11,2021 12:02

ఢిల్లీ : కరోనా దెబ్బతో దేశమంతా అతలాకుతలమైపోయింది. ఇప్పుడిప్పుడే నిదానంగా దేశంలో కరోనా తీవ్రత తగ్గుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. కొన్ని రోజులుగా కోవిడ్‌ కొత్త కేసులు, కోవిడ్‌ మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరోవైపు.. కోవిడ్‌పై పోరాటం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 37,23,367 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 37,60,32,586కి చేరింది.
     నిన్న 18,43,500 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. 41,506 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక కోవిడ్‌ మరణాల సంఖ్య కాస్త తగ్గింది. అంతకుముందు రోజు 1200 మరణాలు నమోదు కాగా.. తాజాగా 895 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,08,040కి చేరింది.
    నిన్న 41,526 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,99,75,064కి చేరింది. రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగింది.
      ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,54,118గా నమోదయ్యాయి. ఆ రేటు 1.47 శాతానికి పడిపోయింది.