Jul 12,2021 14:54

న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు అన్నదాతలు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని తప్పుదోవ పట్టించిన కేసులో ప్రధాన నిందితుడు నటుడు దీప్‌ సిద్దు సోమవారం ఢిల్లీ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయనతో పాటు మరికొంత మంది నిందితులు వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ చేపడుతున్న విచారణలో పాల్గన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా మహేంద్ర సింగ్‌ ఖల్సా అనే నిందితునికి కోర్టు ఉపశమనం కల్పించింది. చార్జీషీట్‌ను అందరికీ అందించాలని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ పోలీసులన ఆదేశిస్తూ..విచారణ తేదీని జులై 22గా ఖరారు చేశారు. గత నెలలో కోర్టు చార్జీషీట్‌ పరిశీలించి...జులై 12న కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.