కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ బసంత్‌కుమార్
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తిలో కోర్టు భవనాలను కలెక్టర్ బసంత్ కుమార్ పరిశీలించారు. పుట్టపర్తిలోని జూనియర్ సివిల్ జడ్జికోర్టు ప్రాంగణంలో జడ్జి ఛాంబర్‌లో కోర్టు భవనాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన మరమ్మతులపై జడ్జి రాకేష్ కలెక్టర్‌కు వివరించారు. వర్ష తీవ్రత మూలంగా కోర్టు గదుల్లో లీకేజీ మూలంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఆయా గదుల వారీగా చేపట్టాల్సిన మరమ్మతులపై ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ బాలాజీ నాయక్, ఇంజినీరింగ్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.










