Apr 23,2023 19:25

ప్రచార భేరి నిర్వహిస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలో ప్రచార భేరిలో భాగంగా 2వ రోజు ఆదివారం ఆటో జాత సాగింది. సిపిఎం మండల కార్యదర్శి వేగురు వెంకయ్య, పచ్చ మధు కాల్తీరెడ్డి రవణమ్మ, మారుబోయిన రాజ మాట్లాడారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి దగా చేసిన బిజెపి పునర లోచించు కోవాలన్నారు. సిపిఎం పేడూరు శాఖ కార్యదర్శి ఈపూర్‌ లక్ష్మయ్య, ఆటో యూనియన్‌ వర్కర్స్‌ నాశీన వెంకటేష్‌, బాషా, రాదయ్య, రైల్వే గుడ్సెషేడ్‌ ముఠా వర్కర్స్‌, మేరబోయిన వెంకట శేషయ్య, గిరి, రషీద్‌, సుబ్రహ్మణ్యం, సునీల్‌, నాగరాజా, నాగేంద్ర, హరీష్‌ పాల్గొన్నారు.