Mar 18,2023 21:47

ఫొటో : బాల్‌బ్యాడ్మింటన్‌ ఆడుతున్న క్రీడాకారులు

కొనసాగుతున్న బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు
ప్రజాశక్తి-కావలి : స్థానిక డి.బి.ఎస్‌. ఇంజనీరింగ్‌ కళాశాలలో 2వ రోజు శనివారం జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి ఇంటర్‌ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలలో వివిధ జిల్లాలో నుంచి వచ్చిన బాలబాలికల క్రీడాకారులలో హోరాహోరీగా కలపడి బాలికల విభాగంలో గట్టి పోటీ ఎదుర్కొని శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు బాలికలు తమ చట్టాని చాటుకొని సెమీఫైనల్స్‌ పోరులో నిలబడ్డారు. ఇదే బాల్‌ బాడ్మింటన్‌ పోటీలలో పాల్గొన్న బాలుర క్రీడాకారులు తమ హావా కొనసాగిస్తూ ప్రకాశం, కర్నూల్‌, కృష్ణ జిల్లాలకు చెందిన బాలుర క్రీడాకారులు సెమీఫైనల్‌ రేసులో నిలుచారు.
రేపటి ఆఖరి రోజు ఫైనల్స్‌ లో జరగబోయే పోటీలలో బాలుర, బాలికల క్రీడాకారులు సెమీఫైనల్స్‌ను దాటుకొని ఫైనల్స్‌ విజయదుందుభి మోగించుటకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ ప్రెసిడెంట్‌ విజయశంకర్‌రెడ్డి ప్రకటనలో తెలియజేశారు.