కొండాపురంలో సంగ్రామయాత్ర
ప్రజాశక్తి-కొండాపురం : మహాజన నేత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎల్‌సి జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం 5వ రోజు వరికుంటపాడు మండలం గుడిసెగుండ్ల గ్రామంలో మొదలైన పాదయాత్ర కొండాపురం మండలం కొత్తపల్లి గరిమెనపెంట గ్రామాల్లోకి చేరుకుంది. ఎంఎస్‌పి నాయకులు ఆంథోనిమాదిగ నేతృత్వంలో అడుగడుగునా, నీరాజనాలు పలికిన మాదిగ పెద్దలు మహిళలు విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరణ విషయంలో బిజెపి ప్రభుత్వం మాదిగలను నమ్మించి మోసం చేసిన విషయాన్ని తెలియజేసి ప్రతి మాదిగ పల్లెల్లో చైతన్యపరుస్తున్నామన్నారు. ఎస్‌సి వర్గీకరణపై బిజెపి ప్రభుత్వం మాదిగలను యుద్ధానికి సిద్ధం చేస్తామని వారు హెచ్చరించారు. అదేవిధంగా ఏప్రిల్ 3న జరిగే బిజెపి జిల్లా కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఎస్‌పి రాష్ట్ర సీనియర్ నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ మాట్లాడుతూ 27, 28 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా జంతర్ మందర్ వద్ద మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నాకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో జిల్లా నుంచి తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్‌పి జిల్లా మహిళా విభాగ ఇన్‌ఛార్జి గేరా జానకి మాల, ఎంఎస్‌పి నాయకులు తాతపూడి డేవిడ్ మాదిగ, ఎంఎంఎస్ జిల్లా కో కన్వీనర్ మంద సుజాత మాదిగ, కంచుపాటి భాగ్యరాజ్, వడ్లపల్లి తిరపతయ్య వి.శ్రీనివాసులు, ముంగర ఏసుమాదిగ, గంగపట్ల రవీంద్ర, గంగపట్ల సురేష్, కంచుపాటి మహేష్, చవలమూడి ప్రవీణ్, కుల్లూరి నరసింహులు, కంచుపాటి రత్తయ్య, చవలమూడి ఆనందరావు, కుల్లూరి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.










