46వ డివిజన్ పర్యటనలో మాజీ మంత్రి వెలంపల్లి
ప్రజాశక్తి - వన్‌టౌన్
స్థానిక 46వ డివిజన్‌లోని 143వ సచివాలయం పరిధిలో మూడో రోజు శుక్రవారర గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్, డివిజన్ కార్పొరేటర్ రాయన బాగ్యలక్ష్మీ, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి పీర్ సాహెబ్ వీధి,పెద్ద మస్తాన్ వీధి, జోసఫ్ వీధి, మసీద్ రోడ్డు, అలీ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్లో వున్నా ప్రజలందరికీ అన్ని సంక్షేమ పధకాలు అందుతున్నాయని సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారని తెలిపారు. మరికొంత మందికి సాంకేతిక లోపాల వల్ల సంక్షేమ పధకాలు అందటం లేదని చెప్పగా వాటిని వెంటనే విచారించి వారికీ సంక్షేమ పధకాలు అందేటట్లు చూడాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కొండ ప్రాంతం కావటంతో మంచినీటి సమస్య ఉందని తెలిపారని, త్వరితగతిన ఆ సమస్యను పరిష్కారిస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికి వెలగలేరులో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు వచ్చాయని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం అందలి అనేదే జగన్ మోహన్ రెడ్డి ఉద్యేశ్యమన్నారు. దానికి అనుగుణంగానే ప్రతి ఏడాది కూడా జూన్, డిసెంబర్ నెలలో సంక్షేమ పధకాల మంజూరు కార్యక్రమం పెట్టి ప్రతి చివరి ఇంటికి కూడా సంక్షేమ పధకాలు అందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే ఈ గడప గడప కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు వెన్నం రజినీ, రాయన నరేంద్ర, స్టాండింగ్ కమిటీ మెంబర్ పడిగపాటి చైతన్య రెడ్డి, కార్పొరేటర్లు శీరంశెట్టి పూర్ణ, గోదావరి గంగ, మైలవరపు రత్నకుమారి, బాపతి కోటిరెడ్డి, ఆంజనేయ రెడ్డి, ఇర్ఫాన్, మరుపిళ్ల రాజేష్, నాయకులు తంగెళ్ల రాము, బంకా చాము, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటరీస్ మరియు నగరపాలక సంస్థ మరియు రెవిన్యు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఎం సహాయ నిధి అందజేత
స్థానిక వన్‌టౌన్‌లోని బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ నియోజవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో 40వ డివిజన్ భవానీపురం అల్లుడుపేట ప్రాంతానికి చెందిన అయుబ్ ఖాన్ తన వైద్య ఖర్చుల నిమిత్తం సిఎం సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయల విలువైన ఎల్‌ఒసిని శుక్రవారం వెలంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డితో కలిసి బాధితుడు అయుబ్‌కి అందచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రాయన నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.










