May 06,2023 22:01

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడి ఐజాక్‌ ప్రవీణ్‌

కొలతల ప్రకారం పని చేయించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొలతల ప్రకారం పనిని కల్పించి పెంచిన కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలని ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కొండయ్యపాలెం గ్రామపంచాయతీ వెంకటరావు పల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ పథకం ద్వారా ఎంఐ ట్యాంకులు జరుగుతున్న పనులను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికమవుతున్న ఎండలు దృష్టిలో ఉంచుకొని ఉదయం 6:30 నుంచి 11 గంటల లోపల కొలతలు ప్రకారం పనులు చేసి ప్రభుత్వం అందిస్తున్న అదనపు నగదను పొందాలన్నారు. పని ప్రదేశాలలో తాగునీరు గుడారం ఏర్పాటు తప్పనిసరి అని అర్హులైన కూలీలకు పనులు కల్పించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టిఎ మనోజ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉన్నిమొదల గురవయ్య కూలీలు పాల్గొన్నారు.