ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు పట్టణం, రూరల్ మండల వైసిపి సచివాలయం కన్వీనర్లు సమావేశం మంగళవారం స్థానిక వెంగమాంబ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి, పరిశీలకులు కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా అందించటానికి జగన్మోహన్ రెడ్డి సచివాలయం కన్వీనరులను నియమించారన్నారు. త్వరలో గహసారధులను వస్తారన్నారు. వీరు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ ను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. పరిశీలకులు కొమ్మూరికనకారావు మాట్లాడుతూ ఎంతో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు మహీధర్ రెడ్డి దగ్గర పార్టీ నాయకులుగా పనిచేయడం సంతోషకరమన్నారు. సచివాలయం కన్వీనర్ లు సైనికుల్లాగా పనిచేయాలన్నారు. తొలుతు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తయి నాలుగేళ్లు అయిన సందర్భంగా ఎంఎల్‌ఎ, కనకరావు కేక్ కట్ చేశారు.










