Mar 28,2023 22:35

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ

ప్రజాశక్తి -పెనుకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కనుసైగ చేస్తే చాలు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్‌ను మంగళగిరి వరకు తరిమికొడతామని స్థానిక ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్‌ నారాయణ అన్నారు. లోకేష్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర నారాయణ మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. లోకేష్‌ స్థానిక పరిస్థితుల్లో తెలియకుండా పక్కన వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివుతున్నాడని అన్నారు. జగన్‌ కనుసైగ చేస్తే చాటు లోకేష్‌ను జిల్లా దాటే వరకు తరిమికొడతామని అన్నారు. డీజిల్‌, ఇసుక దొంగలను తన పక్కన పెట్టికుని తమపై విమర్శలు చేయడాన్ని చూస్తే లోకేష్‌ బాబు రాజకీయ పరిజ్ఞానంపై అనుమానం వస్తుందని అన్నారు. పెనుకొండ నియోజవర్గంలో జరిగిన అభివద్ధిపై ఏ సమయంలోనైనా సరే బహిరంగకు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. లోకేష్‌ తాతకి రెండు ఎకరాలే భూమి ఉండేదని తన తాతకు 50 ఎకరాలు భూమి ఉండేదని అన్నారు. 35ఏళ్ళ రాజకీయం అంటూ విర్రవీగే పార్థసారధి అనంతపురం లో కాపురం ఉంటున్నారని, తాను పెనుకొండ లో ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటున్నానని అన్నారు. మరోవైపు సవితమ్మ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్రమంగా డిజల్‌, కంకర వ్యాపారాలు చేసుకుంటూ కేసుల్లో ఇరుక్కొంటే తాము కేసులు పెట్టాం అంటే ఎలా అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సానిపల్లి మంగమ్మ, జెడ్పీటీసీ శ్రీరాములు, ఎంపీపీ రామ్మోహన్‌ రెడ్డి, నాయకులు జయశంకర్‌ రెడ్డి, నరసింహ, నాగలూరు బాబు, శ్రీనివాసులు, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.