ప్రజాశక్తి - ఒంటిమిట్ట
ఒంటిమిట్టలోని పురాతన చారిత్ర కప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజా రోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుండి 10.20 గంటల వరకు వృషభలగంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వ హించారు. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెఇఒ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మో త్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్స వాల్లో ప్రధానంగా ఏప్రిల్ 3న హనుమంత వాహనం, 5న కల్యాణోత్సవం, 6న రథోత్సవం, 8న చక్రస్నానం జరుగుతాయన్నారు. కల్యాణం రోజున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పి స్తారని తెలిపారు. జిల్లా యంత్రాంగంతో సమ న్వయం చేసుకొని ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు. కంకణబట్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ముందుగా గరుడ ధ్వజ పటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామ తాభిషేకం చేసినట్టు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టది క్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, శిక్షణ కలెక్టర్ రాహుల్ మీనా, ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్ బాబు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
శేషవాహనంపై దర్శనమిచ్చిన కోదండరాముడు
శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్స వాల్లో మొదటి రోజైన శుక్రవారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు. భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ నిర్వ హించారు. ఆలయ మాడ వీధుల్లో కేరళ వాయిద్యాలు, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలా టాలతో స్వామివారిని కీర్తి స్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కల్యాణోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జెఇఒ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామిబ్రహోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్బంగా భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లను టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి కల్యాణోత్సవం రోజున పట్టువస్త్రాల సమర్పణకు వచ్చినప్పుడు ఆల యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో జెఇఒ చర్చించారు. కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. జెసి సాయికాంత్ వర్మ మాట్లాడుతూ జిల్లా నుంచి డెప్యుటేషన్ మీద నియమించిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయం వద్దగల పరిపాలన భవనంలో జెఇఒ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డిఎఫ్‌ఒ శ్రీనివాస్, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) వెంకటేశ్వర్లు, డిఇ చంద్రశేఖర్, ఇఇ సుమతి, డెప్యూటీ ఇఒలు గుణభూషణ్‌రెడ్డి, నటేష్ బాబు, శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.










