Apr 06,2022 22:12

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : దాదాపు మూడు నెలల కనూురు పండగ వాతావరణంతో కళకళలాడుతోంది. సిపిఎం జాతీయ మహాసభలకుసనుద్ధమవుతూ .. వివిధ సాంస్క ృతిక, సన్నాహక కార్యక్రమాలతో ఉత్సవ ఉత్సాహాన్ని సంతరించుకొంది. సిపిఎం కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు; నగరంలోని, జిల్లాలోని ప్రజలందరూ ఈ ఉత్సవానిు తమ సొంత పండగగా ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సమేతంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, ఆనందభరితులవుతున్నారు. కన్నూరు చారిత్రికంగా అనేక పోరాటాలు జరిగిన నేల. అనేకమంది త్యాగధనులకు పుట్టినిల్లు.. కేరళ కమ్యూనిస్టు ఉద్యమానికి పురిటిగడ్డ కూడా. అలాంటి చరిత్ర కలిగిన కన్నూరు ఆ ఘన వారసత్వాన్ని, నేటి కర్తవ్యాన్ని కలగలిపిన కార్యక్రమాలను రూపొందించారు. అందులో పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, యువతీ యువకులు, మహిళలు, సాహిత్య కళారంగ ప్రముఖులు, అభిమానులు మమేకమయ్యారు. జనవరి 17న తొలి సన్నాహక సమావేశం జరిగింది మొదలు, అప్పటినుంచీ కార్యకర్తలు, వామపక్ష అభిమానులూ మహాసభల ఏర్పాట్లలో, అనుబంధ కార్యక్రమాల్లో అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. సదస్సులు, సాంస్క ృతిక కార్యక్రమాలు, రెండు పెద్ద జాతాలు, కమ్యూనిస్టు పార్టీ చరిత్రపై విద్యార్థులకుమెగా క్విజ్‌, చరిత్రను చాటే ఎగ్జిబిషన్‌, యువతకుఆటల పోటీలు, నాటక పోటీలు, సాగర తీరంలో గాలిపటాల ఉత్సవం, ఇంటరుేషనల్‌ ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ... ఇలా బహుముఖంగా మహాసభల సనాుహ సందడి ఒక పండగలా కొనసాగింది.

  • స్థానిక 'చరిత్ర' పదిలం

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రూపొందించిన గోడ చిత్రాలు కళాకారుల సృజనాత్మకతకు, పార్టీ చరిత్రకు, ప్రత్యేకతకూ అద్దం పట్టాయి. 'హిస్టరీ వాల్‌' పేరుతో స్థానిక చారిత్రక పత్రాల సమగ్ర డిజిటల్‌ ఆర్కైవ్‌ను ఈ సందర్భంగా ఎక్కడికక్కడ రూపొందించారు. అమర వీరుల త్యాగాలను, చరిత్రను విస్తారంగా ప్రచారం చేశారు. ఏప్రిల్‌ 1 సాయంత్రం నిర్వహించిన రెడ్‌ ఫ్లాగ్‌ డేతో కనూురు ఉత్సవ ఉత్సాహం పతాక స్థాయికి చేరింది. నగరమంతా ఎర్రజెండాలతో, అరుణారుణ కాంతులతో ధగధగలాడింది. 23వ మహాసభల సందర్భంగా కనూురులోని23 అత్యంత నిస్సహాయ పేద కుటుంబాలకుసిపిఎం 23 ఇళ్లను నిర్మించి ఈనెల 4వ తేదీన అందచేసింది. ఈ జిల్లాలో ఇలాంటి ఇళ్లు 212 మందికి సిపిఎం నిర్మించి, లబ్ధిదారులకుఅందించింది. కనూుర్‌ టౌన్‌ స్క్వేర్‌లోనికె వరదరాజన్‌ నగర్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌ను వేలాది మంది వీక్షించారు. నాటి వీరోచిత ప్రజా పోరాటాలను గుర్తు చేస్తూ పెయింటింగ్స్‌, శిల్పాల ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. మొత్తం కార్యక్రమాలను పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది వీక్షిస్తున్నారు. యూట్యూబ్‌ ఛానెల్‌లోనూ మహాసభల విశేషాలు ప్రసారం అవుతున్నాయి.
కనూురు జిల్లాలోని18 ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించగా పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. అధిష్టానం వద్దనిఆదేశించినా సరే అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు సెమినార్‌కుహాజరయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రికెట్‌, షటిల్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, చెస్‌, కంబాలి సహా 11 క్రీడాంశాల్లో వేలాది మంది పోటీపడ్డారు. ఈ మహాసభలకుకనూురులోనిగ్రామగ్రామానా, వీధివీధినా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి, మహాసభల సందేశానిు వివరించారు. ప్రజలు ఇచ్చిన విరాళాలను సేకరించారు. ఈ విధంగా మహాసభల ఉత్సాహం పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు, ప్రజలందరి పర్వదినంగా మారింది.

'కన్నూ'రు నిండుగా .. ఎర్రజెండా పండుగ