Apr 10,2022 07:28

సిపిఎం అఖిల భారత మహాసభల సందర్భంగా శనివారం రాత్రి ప్రదర్శించిన కళా ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేరళ సమాజంలోని ఒకప్పటి అకృత్యాలను, వాటిపై సాగించిన పోరాటాలను ఈ ప్రదర్శనలలో వివరించారు. కళాకారులు అద్భుతంగా అభినయించి, ప్రేక్షకుల కరతాళ ధ్వానాలను అందుకున్నారు. ప్రదర్శనలోని సన్నివేశ రసావిష్కరణకు అనుగుణంగా లైటింగ్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చారు.