Apr 10,2022 22:57

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి
కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఎకె పద్మనాభన్‌ ఎన్నికయ్యారు. అంతకుముందు మహాసభ కంట్రోల్‌ కమిషన్‌ సభ్యులుగా ఎకె పద్మనాభన్‌, ఎం.విజయ్ కుమార్‌, శ్రీధర్‌, మాలిని భట్టాచార్య, ఎస్‌.వీరయ్యలను మహాసభ ఎన్నుకుంది. అనంతరం కమిషన్‌ సభ్యులు సమావేశమై ఛైర్మన్‌ను ఎన్నుకున్నారు.

  • కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు

పొలిట్‌ బ్యూరో సభ్యులుగా రిలీవ్‌ అయిన ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బిమన్‌ బసు, హన్నన్‌ మొల్లాలను కేంద్ర కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా మహాసభ ఎన్నుకుంది. అదే విధంగా కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులుగా రాజేంద్రసింగ్‌ నేగి, సంజయ్ పరాటే ఎన్నికయ్యారు.
ఐదు రోజుల పాటు జరిగిన సిపిఎం అఖిల భారత మహాసభ ఆఖరి రోజైన ఆదివారం 17 మందితో కూడిన పొలిట్‌ బ్యూరోని ఎన్నుకొంది. ఈ సభలో ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బిమన్‌ బసు, హన్నన్‌ మొల్లా పొలిట్‌ బ్యూరో సభ్యులుగా రిలీవయ్యారు. వారి స్థానంలో ... కొత్తగా ఎన్నికయ్యారు.