కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్లు అందజేత
ప్రజాశక్తి-కావలి : ప్రియదర్శిని మహిళామండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు షేక్ ఖాదర్‌బీ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు వారి సౌజన్యంతో నిర్వహించిన కంప్యూటర్ కోర్స్ శిక్షణ పొందిన 20మంది మహిళలకు మంగళవారం కావలి విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఖాదర్ బాషా మాట్లాడుతూ ప్రియదర్శిని మహిళామండలి అధ్యక్షులు ఖాదర్‌బీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారన్నారు. అలాగే నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు వారిద్వార ఈ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి, వారికి శిక్షణ ఇచ్చి, ఈ రోజు నిరుద్యోగ, యువతీ యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. మీరందరూ ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు, సర్టిఫికెట్లు ఎంతోఉపయోగ పడుతాయన్నారు. కావున సద్వినియోగం చేసుకోవాలని సలహాలు, సూచనలిచ్చారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఖాదర్ బాషా, ప్రియదర్శిని మహిళామండలి అధ్యక్షులు, ఖాదర్‌బీ, రహీమ్ చారిటబుల్ ట్రస్ట్, అలీం అహమ్మద్, హ్యాపీ స్వచ్ఛంద సంస్థ ఘని బాషా, ఎంపిజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రఫీ అహమ్మద్, జాగో స్వచ్ఛంద సంస్థ జమీర్, గుడ్‌మెన్ చారిటబుల్ ట్రస్ట్ బ్రహ్మయ్య, టైమ్ టూ హెల్ప్ సంస్థ రమేష్, సర్టిఫికెట్ లబ్ధిదారులు, 20మంది హాజరయ్యారు.










