Mar 03,2023 22:20

ఫొటో : పిచికారీ చేస్తున వైద్య సిబ్బంది

కంపసముద్రంలో డెంగీ కలకలం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని కంపసముద్రం ఎస్‌సి కాలనీలో డెంగీ జ్వరం కలకలం రేపుతోంది. అదే గ్రామానికి చెందిన నల్లిపోగు చిన్నయ్యకు జ్వరం రావడంతో వైద్యసిబ్బంది ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి పంపగా అక్కడ రక్త పరీక్ష చేయగా డెంగీ జ్వరం నిర్థారణ అయింది. వెంటనే స్పందించిన డాక్టర్లు కల్పన, గోపినాధ్‌ సబ్‌ యూనిట్‌ అధికారి ఎస్‌.జి నౌషాద్‌బాబు, ఆరోగ్య విస్తరణ అధికారి ఎన్‌.కొండారెడ్డి ఆధ్యర్యంలో సిబ్బందిని నాలుగు టీములుగా విభజించి ఇంటింటికి తిరుగుతూ లార్వా, జ్వర పీడితుల సర్వే, ఇన్డోర్‌ స్పేస్‌ స్ప్రేయింగ్‌, ఆంటి లార్వా ఆపరేషన్‌ చేయించారు.
95 ఇళ్ల లోపల పైరత్రం పిచికారీ చేయించారు. కార్యక్రమంలో టిబి ఆర్గనైజర్‌ బి.కొండారెడ్డి హెచ్‌ వి.సంపూర్ణమ్మ, సూపర్‌వైజర్లు ఎస్‌.కె.సైదా, ఎస్‌కె.ఖాజామోహిద్దీన్‌, హెల్త్‌ అసిస్టెంట్లు డి.రమణయ్య, బి.అంకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.