Jan 17,2023 21:19

ప్లాన్‌ను పరిశీలిస్తున్న అధికారులు

ప్లాన్‌ను పరిశీలిస్తున్న అధికారులు
కండలేరు జలాశయం సందర్శన
రాపూరు:పెన్నా పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు సందర్శనలో భాగంగా మంగళవారం కండలేరు జలాశయాన్నీ కష్ణ రివర్‌ బోర్డు డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌, ఈఈ శివ శంకరయ్య సందర్శించారు. కండలేరుకు చేరుకున్న ఆయనకి కండలేరు, సోమశిల ఎస్‌ఇలు హరి నారాయణరెడ్డి, రమణా రెడ్డిలు స్వాగతం పలికారు.అనంతరం ఆయన సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వ తదితర అంశాలపై చర్చించారు. పెన్నా పరివాహక జలాశయం నుంచి చెన్నరుకి విడుదల చేసే నీటి వివరాలు, ప్రస్తుతం సోమశిల, కండలేరు జలాశయాల్లో నిల్వలు గురించి చర్చించారు. అనంతరం సత్య సాయి గంగ కాలువను పరిశీలించారు. తెలుగుగంగ ఎస్‌ఇ హరి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతేడాది
కండలేరు నుంచి చెన్నరుకి 12 టిఎంసిల నీటిని విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది 4.8 టిఎంసిల నీరు చెన్నరుకి విడుదల చేశామన్నారు.వర్షాల కారణంగా చెన్నైలో నీరు ఉండడం వల్ల 11.1 టీఎంసీల నీటిని నిలుపుదల చేశామన్నారు.చెన్నై ప్రాంత వాసులకు ఎప్పుడు నీరు అవసరమైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో కండలేరు, సోమశిల ఈఈలు విజరు కుమార్‌ రెడ్డి, దశరథ రామిరెడ్డి, డిఇలు ముని వేణు, సుబ్రహ్మణేశ్వర రావు, బాబయ్య, ఎఇలు తిరుమలయ్య, గోపి కష్ణ, సాయి ప్రతాప్‌, చిట్టి బాబు, ప్రసన్న లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.