Jan 14,2023 21:30

కందికుంటతో కరచాలనం చేస్తున్న గోపీచంద్‌

          కదిరి టౌన్‌ : నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి డైరెక్టర్‌ గోపీచంద్‌ శనివారం పట్టణంలోని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛా ర్జి కందికుంట నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సినిమా విజయం సాధించడంతో డైరెక్టర్‌ గోపీచంద్‌ కదిరికి విచ్చేసి అభిమనులతో కలిసి రాధిక థియేటర్‌లో సినిమాను వీక్షించారు. అనంత రం అభిమానులతో కలిసి కేక్‌ కోసం సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పట్టణంలోని శ్రీమద్‌ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైమండ్‌ ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు