Jan 02,2023 09:46

చిన్నారితో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న కందికుంట వెంకటప్రసాద్‌

        కదిరి టౌన్‌ : టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ జన్మదినం సందర్భంగా కదిరి పట్టణంలోని ఆయన నివాసం వద్ద అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆదివారం నాడు సందడి నెలకొంది. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే పట్టణంలో బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆదివారం నూతన సంవత్సరం, కందికుంట జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల కందికుంట అభిమానులు కేకులు కట్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేదల పక్షపాతిగా కందికుంట వెంకటప్రసాద్‌ పని చేస్తున్నారన్నారు. కందికుంట సైతం ఆయన నివాసం వద్దకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.