Feb 19,2023 22:13

కమనీయం శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి కల్యాణంపట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు

రాజంపేట అర్బన్‌
అత్తిరాలలో వెలసిన శ్రీ కామాక్షిత్రేతేశ్వర స్వామికి ఆదివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్‌రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే స్వయంగా తీసకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం సతిసమేతంగా స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో కామాక్షిత్రేతేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌ వి.వెంకట సుబ్బారెడ్డి, రాజంపేట మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పోలి సుబ్బారెడ్డి, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందరం వేణుగోపాల్‌రెడ్డి, వైసిపి నాయకులు మందరం గంగిరెడ్డి, వజ్ర శేఖర్‌ రెడ్డి, కమలేశ్వరరావు, ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, పాలగిరి మల్లికార్జున్‌ రెడ్డి, సత్యాల రామకష్ణ, కొరముట్ల హరి, మలిశెట్టి శ్రీరాములు పాల్గొన్నారు.